వినియోగదారులకు మెరుగైన సేవలను అందించి వారి మన్నలను పొందాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నాని మొబైల్స్ అండ్ యాక్సెసరీస్ రీ మోడలింగ్ నూతన షాపును శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వినియోగదారుల మన్నలను పొందినప్పుడు సంస్థలు అభివృద్ధి బాటలో నడుస్తాయని పేర్కొన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వ్యాపారంలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహకులు దేసోజ్ రవీంద్ర చారి, కళ్యాణి మాట్లాడుతూ. 20 సంవత్సరాల అనుభవంతో మొబైల్ అండ్ యాక్సెసరీస్, మొబైల్ సర్వీసెస్ షాపు నడుపుతున్నానని అన్నారు. ఐఫోన్ కు సంబంధించిన అన్ని రకాల సర్వీస్ లను మొబైల్ షాప్ లో అందిస్తున్నామని తెలిపారు. ఇన్ని సంవత్సరాలుగా వినియోగదారులు తమ పట్ల ఉంచిన నమ్మకం విశ్వాసంతో ముందుకు సాగుతున్నామని, అదేవిధంగా ఇప్పుడు కూడా కస్టమర్లు ఆదరాభిమానాలను అందించాలని కోరారు. చక్కని నాణ్యతతో సరసనమైన ధరలలో నైతికతతో మొబైల్ సేవలు అందించడంలో నాని మొబైల్స్ ఎల్లప్పుడు కూడా ముందుంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, మిత్రులు, బంధువులు, గుర్రం సత్యనారాయణ రెడ్డి, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, గోపగాని వెంకటనారాయణ గౌడ్, గండూరి ప్రకాష్, మారిపెద్ది శ్రీనివాస్, ఎర్రం శెట్టి ఉపేందర్, డాక్టర్ కృష్ణ బంటు, పర్వతం భరత్ కుమార్, మహంకాళి శివ, సాయి, నజీర్, పవన్, దారోజు ఉపేందర్, వీరబాబు, పవన్, చరణ్, చింటూ, పండు, తదితరులు పాల్గొన్నారు.
