Tnrnews.in
తెలంగాణ

ఏలూరి పార్వతి అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గల పోటీలు

మోతె : సంక్రాంతి పండుగ సందర్భంగా మోతె మండల పరిధిలోని సర్వారం గ్రామంలో ఏలూరి పార్వతి అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు మొదటి బహుమతి గా కూలర్, రెండవ బహుమతిగా డ్రెస్సింగ్ టేబుల్, మూడవ బహుమతిగా ప్రెజర్ కుక్కర్ లను బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు చేతులమీదుగా బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.మహిళల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ముగ్గుల పోటీలు దోహద పడతాయని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మూడు నగేష్ నాయక్, సర్వారం గ్రామ పెద్దలు మిక్కిలినేని పురుషోత్తరావు, గ్రామ యువత నాయకులు తదితరులు మహిళలు పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సిపిఎం జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి

Harish Hs

నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణాన్ని ప్రారంభించిన తెలంగాణ పర్యాటకశాఖ…..

Harish Hs

రైతులకు లాభసాటి పంటలపై అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

TNR NEWS

ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో మహా న్యూస్ ఎండీ మారెళ్ల వంశీ కృష్ణ పుట్టినరోజు వేడుకలు

Harish Hs

పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి

Harish Hs

ప్రజల భద్రతకై పోలీసు తపన. – కుటుంబాల కోసం స్వియరక్షన జాగ్రత్తలు తప్పనిసరి. – ప్రతి ప్రయాణం సురక్షిత గమ్యం చేరాలి. – క్రాసింగ్ ల వద్ద రోడ్డు దాటడంలో స్థానిక ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. -… నరసింహ ఐపిఎస్, ఎస్పీ సూర్యాపేట జిల్లా.

TNR NEWS