రాయికల్ పట్టణంతో పాటు చుట్టూ పక్కల గ్రామాల్లో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ యూత్ పట్టణ అధ్యక్షుడు బత్తిని నాగరాజు, బాపురపు రాజీవ్, జక్కుల సాగర్, జలపతి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రమేష్, సీనియర్ నాయకులు నర్సయ్య, భూమయ్య, గోపాల్, నర్సింహ రెడ్డి, గుర్రం మహేందర్ గౌడ్, కొయ్యడి మహిపాల్ రెడ్డి, మున్ను, దాసరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.