కొత్తపేట : కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో ఈ రోజు జరిగిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు,జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్,రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీ గణేష్ కుమార్,వాసురెడ్డి రాంబాబు, ఆకుల రామకృష్ణ,కె వి సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.స్థానిక ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అలాగే రావులపాలెం నారాయణ విద్యాసంస్థలు మరియు లుదియా కళాశాల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ఎన్డీయే కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు.అలాగే రాజశేఖర్ గెలుపు కోసం కృషి చేయాలని కూటమి నాయకులు,పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే సత్యానందరావు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గుత్తుల రాంబాబు, పాలూరి సత్యానందం,పి సత్యవతి,తోట స్వామి, అయినవిల్లి సత్తిబాబు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

previous post
next post