కాకినాడ : ప్రజా సేవే పరమావధిగా ఎందరికో ఆపన్న హస్తం అందిస్తూ సేవా దృక్పథంతో ముందుకు వెళుతూ అందరి మన్ననలు పొందుతున్నారు జనసేన సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్). ప్రజా సేవలో ముందువరుసలో ఉండాలనే ఉద్దేశంతో నిరంతరం ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్పూర్తితో, ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ ల ఆశయాలకు అనుగుణంగా మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) సేవ చేస్తున్నారు. కాకినాడ పట్టణంలోని జగన్నాధపురంలోని 16వ డివిజన్ గోళీలపేటలో ఇటీవల మృతి చెందిన సూరపు సత్తిబాబు కుటుంబ సభ్యులను శనివారం ఆయన కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన వీర మహిళ బండే సుజాత మాట్లాడుతూ సూరపు సత్తిబాబు కుటుంబానికి జనసేన పార్టీ తరపున మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) అండగా వుంటారని, ఎలాంటి కష్టం ఉన్నా తమంతా ఉన్నామని, అధైర్య పడవద్దని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఇప్పటి వరకు 305 మందికి ఆర్ధిక సహాయం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుడు 16వ డివిజన్ ఇంచార్జీ ప్రసాద్, జనసేన పార్టీ వీర మహిళలు బంటు లీల, రచ్చ ధనలక్ష్మి, దీప్తి, సంధ్య, రమ్య, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
