తాటిచెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడగా వ్యక్తికి గాయాలైన సంఘటన మంచిర్యాల జిల్లాలో మిట్టపల్లిలో శనివారం చోటుచేసుకుంది.సంబంధిత శాఖపరంగా ప్రభుత్వం వెంటనే అతనికి ఆర్థిక సాయం అందించాలని సోమవారం ఈ సందర్భంగా గాయపడిన వ్యక్తి కుటుంబ సభ్యులు కోరారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మిట్టపల్లికి చెందిన గడ్డం సత్య గౌడ్ రోజువారి పనిలో భాగంగా శనివారం స్థానిక గ్రామంలోని పొలాల చెంతనున్న తాటి చెట్టు ఎక్కగా ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలానికి సమీపంలోని రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా చికిత్స నిమిత్తం వెంటనే అతనిని 108 అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించారు.