Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
సినిమా వార్తలు

‘డ్రాగన్’ సినిమాను మహేశ్ బాబు చూడాలని కోరుకుంటున్నా

తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోలీవుడ్ సినిమా ‘డ్రాగన్’ హిట్ టాక్ ను సంపాదించుకుంది. యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమా విజయవంతం కావడంతో ‘డ్రాగన్’ మూవీ టీమ్ సక్సెస్ మీట్ జరుపుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు అశ్వత్ మారిముత్తు మాట్లాడుతూ… ఇంతకు ముందు తన ‘ఓ మై కడవులే’ సినిమాను మహేశ్ బాబు చూసి ట్వీట్ చేశారని… దీంతో భారీ సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి తన సినిమా చూశారని తెలిపారు. ఇప్పుడు ‘డ్రాగన్’ సినిమాను కూడా మహేశ్ బాబు చూడాలని కోరుకుంటున్నానని చెప్పారు. తన విన్నపం ఎవరి ద్వారా అయినా ఆయనకు చేరుతుందని నమ్ముతున్నానని అన్నారు.

Related posts

కరుణ లేనిచోట హింసకు బీజం పడుతుంది

TNR NEWS

‘ది రాజా సాబ్’ నుండి కీలక అప్ డేట్

TNR NEWS

ప్రభాతో జట్టుకట్టడంపై స్పందించిన అనిల్ రావిపూడి

TNR NEWS

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నేటితో 50రోజులు పూర్తి

TNR NEWS

ఫరియా అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్…

TNR NEWS

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ ఎలా ఉందో చూద్దాం రండి

TNR NEWS