Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

కుక్కుటేశ్వరుడి హుండీ ఆదాయం రూ.11,74,660/-

పిఠాపురం : దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన పిఠాపురం పాదగయా క్షేత్రంలోని శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం వారి హుండీ లెక్కింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. సిఎఫ్‌ఓ సిహెచ్‌.రామ్మోహనరావు, ఇన్స్పెక్టర్‌ వడ్డి ఫణీంద్ర కుమార్‌, జోగా సత్యనారాయణ పర్యవేక్షణలో ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ మహాశివరాత్రి పురస్కరించుకుని 17 రోజులకుగాను రూ.11,74,660/-లు హుండీ ద్వారా ఆదాయం వచ్చిందన్నారు. గత సంవత్సర హుండీ అదాయంతో చూస్తే ఈసారి ఆదాయం బాగా పెరిగిందని ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్త బృందం, బ్యాంకు సిబ్బంది, పోలీసు సిబ్బంది, అర్చకులు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

తిరుమల పవిత్రత పరిరక్షనే ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా అడుగులు వేస్తున్న బీసీవై పార్టీ అధినేత

TNR NEWS

గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తాదాన శిబిరం

Dr Suneelkumar Yandra

బాణాసంచా పేలుడులో గాయపడిన కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలి – పౌర సంక్షేమ సంఘం డిమాండ్

సీఎం చంద్రబాబును మరిచిపోయిన అధికారులు.. సొంత ఇలాఖాలోనే ఇలానా?

TNR NEWS

ఉపాధి పనులు పరిశీలించిన పాడా పీడీ

Dr Suneelkumar Yandra

సమాజంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకం

Dr Suneelkumar Yandra