పదార్థాలకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని సూర్యపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సామాజికవేత్త రాచకొండ ప్రభాకర్ తెలిపారు. ఆదివారం కోదాడ పట్టణంలో బాయ్స్ హై స్కూల్, మార్కెట్ పరిసరాలలో ప్రజలకు మైకులో మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలను వివరిస్తూ అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్, మద్యం, గుట్కా, తంబాకు వంటి చెడు అలవాట్లతో ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయని వారిని నమ్ముకున్న కుటుంబాలు రోడ్డు పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ మత్తు పదార్థాల బారిన పడకుండా ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఆదివారం పండుగ సెలవు దినాల్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో జిల్లావ్యాప్తంగా తనవంతు బాధ్యతగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు……