Tnrnews.in
తెలంగాణరాజకీయం

వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు నిమ్మ పిచ్చమ్మ మరణం వ్యవసాయ కార్మిక ఉద్యమానికి తీరని లోటు….  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

 

సూర్యాపేట టౌన్: వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు, నిమ్మ పిచ్చమ్మ మరణం వ్యవసాయ కార్మిక ఉద్యమానికి తీరని లోటు అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు అన్నారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని విగ్నేశ్వర ఫంక్షన్ హాల్ లో జరిగిన నిమ్మ పిచ్చమ్మ సంతాప సభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన అనేక కూలి, భూమి పోరాటంలో ఆమె కీలక పాత్ర కుషించారని అన్నారు. మోతే మండలంనామవరం గ్రామానికి చెందిన నిమ్మ పిచ్చమ్మ గత 20 సంవత్సరాలుగా సూర్యాపేటలో నివాసం ఉంటూ పట్టణంలో వ్యవసాయ కార్మికులు, మహిళలు, దళితులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన అనేక పోరాటాలలో ఆమె పాల్గొన్నారు అని అన్నారు. వన్ టౌన్ పరిధిలో జరిగిన అనేక కూలి, ఉపాధి పోరాటంలో ఆమె కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆమె మరణంపట్టణ పేదలకువ్యవసాయ కార్మిక వర్గానికి తీరని లోటు అని ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు నిమ్మ బిక్షం, నరేష్, వివిధ ప్రజాసంఘాల నాయకులు భయ్యా గంగరాజు, తండు నాగయ్య, బైరి రవి, కోల రవి, కారింగుల వెంకన్న, కోల కృష్ణ, కుంట్ల నాగిరెడ్డి తదితరులు పాల్గొని నిమ్మ పిచ్చమ్మచిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అనుమతులు లేని ఇసుక లారీ పట్టివేత

TNR NEWS

ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలి

Harish Hs

మిల్లర్ల దోపిడీ నుంచి రైతులను కాపాడాలి

Harish Hs

వి. ఎన్. జీవితం స్ఫూర్తిదాయకం*…..  *జిల్లా సమగ్ర అభివృద్ధిలో విఎన్ పాత్ర మరువలేనిది.*….  *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

ఇండ్ల సర్వే పకడ్బoదిగా నిర్వహించాలి…. సర్వే త్వరగా పూర్తి చేయాలి….. జిల్లా అదనపు కలెక్టర్…..పి రాంబాబు 

TNR NEWS

డ్రగ్స్,సైబర్ నేరాలపై అవగాహన

TNR NEWS