అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం (ఏఏఎస్ కే)కోదాడ ఆధ్వర్యంలో
స్థానిక ఎమ్మెస్ కళాశాల లో నిర్వహించే ఉచిత పాలిటెక్నిక్, టీఎస్ఆర్ జెసి ఎంట్రెన్స్ శిక్షణ కేంద్రంలో ఇటీవల పదవ తరగతి ఫలితాలలో జిల్లా టాపర్ గా నిలిచిన జడ్ పి.హెచ్.ఎస్ కోదాడ కు చెందిన విద్యార్థిని తాళ్లూరి రేఖశ్రీ ను 571 మార్కులు సాధించినందుకు గాను ఆస్క్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.ఏఏఎస్ కే అధ్యక్షురాలు
బల్గూరి స్నేహ దుర్గయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ ఎమ్మెస్ కళాశాల చైర్మన్ పందిరి నాగిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ,వినయం కలిగి ఉండి తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ మీరు కూడా కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు.అదేవిధంగా మీరు ఉన్నత స్థానాలకు చేరుకొని ఈ సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.అదేవిధంగా రేఖశ్రీ మంచి ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించేందుకు కృషి చేయాలని అభినందించారు.ఇంకా ఈ కార్యక్రమంలో ఆస్క్ ప్రధాన కార్యదర్శి మాతంగి ప్రభాకర్ రావు,కళాశాల సీఈవో షేకు శ్రీనివాస రావు,జేఎల్ గురుకుల ఆడెపు వెంకటేశ్వర్లు,కోర్స్ డైరెక్టర్ యలమర్తి శౌరి,కోర్స్ కో- ఆర్డినేటర్ గంధం బుచ్చరావు,నందిపాటి సైదులు,చెరుకుపల్లి కిరణ్,జానకి రాములు,మీసాల రవి,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.