కళ్ళు గీసేందుకు తాడిచెట్టు ఎక్కిన గీత కార్మికుడు ప్రమాదవశాత్తు తాడి చెట్టు పై నుండి పడి తీవ్ర గాయాలు అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, మునగాల మండల పరిధిలోని నారాయణ గూడెం గ్రామంలో గత ఆదివారం సాయంత్రం గ్రామానికి చెందిన కాసాని వెంకటేశ్వర్లు అనే గీత కార్మికుడు గ్రామ సమీపంలోని తాడిచెట్టు ఎక్కి కల్లుగీస్తుండగా ప్రమాదవశాత్తు మొకు తెగిపోయి చెట్టు పైనుండి కింద పడిన సంఘటనలో గీత కార్మికుడు వెంకటేశ్వర్లుకు కుడికాలు విరిగిపోగా,తలకు మరియు ఇతర శరీర భాగంలో తీవ్రమైన గాయాలయ్యాయి, వెంటనే చుట్టుపక్కల ఉన్న స్థానికులు స్పందించి ఆటోలో హుటాహుటిన వెంకటేశ్వర్లను కోదాడ వైద్యశాలకు తరలించగా, మెరుగైన వైద్యం కోసం కోదాడ నుండి హైదరాబాదుకు తరలించడం జరిగింది,నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటేశ్వర్లు ప్రతిరోజు గీత వృత్తిని నమ్ముకుని కళ్ళు గీస్తూ ముంజలు కొట్టి అమ్ముతూ వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడని స్థానికులు తెలిపారు. ఎలాంటి ఆస్తిపాస్తులు భూములు లేక గీత వృత్తిని నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న వెంకటేశ్వర్లు కు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు మరియు తన కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం మరియు స్థానిక అధికారులు మానవత్వంతో తోడ్పాటు అందించాలని గ్రామానికి చెందిన పలువురు కోరుతున్నారు.