November 17, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ముఖ్యమంత్రి హామీ మేరకు – చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులను, మహిళా కమిషన్ సభ్యులుగా నియమించాలి

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులకు మహిళా కమిషనర్ సభ్యులుగా స్థానం కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పోనుగోటి రంగా మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గతంలో ఐలమ్మ జయంతి ఉత్సవాల సందర్భంగా రవీంద్రభారతిలో జరిగిన జయంతి ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఐలమ్మ వారసురాలైన చిట్యాల శ్వేత ను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమిస్తానని హామీ ఇచ్చారని, నెలలు గడుస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నేటి వరకు నెరవేర్చకపోవడం రాష్ట్ర రజకుల మనోభావాలను దెబ్బతీసే లాగా ఉన్నదని, కావున తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించాలని,తెలంగాణ ఉద్యమంలో రజాకార్లకు నిజాములకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి అసువులు బాసిన ఐలమ్మ కుటుంబానికి సీఎం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.

Related posts

నేడు మునగాల లో భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు అధిక సంఖ్యలో రైతులు హాజరు కావాలి

TNR NEWS

మాస్టిన్ కుల హక్కుల పోరాట సమితి పట్టణ కమిటీ ఎన్నిక

Harish Hs

పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన న్యాయవాది

Harish Hs

ఈనెల 24న జిల్లా కరాటే అసోసియేషన్ల ముఖ్య సమావేశం

Harish Hs

భగవద్గీత పఠనంలో స్వర్ణ పతకం జయించిన లక్ష్మి తులసి

Harish Hs

బిసి ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

Harish Hs