సీపీఎం సీనియర్ నాయకులు గుండాల రాములు ఆశయాల సాధన కొరకు కృషి చేద్దామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. నల్గొండ మండలం అన్నారెడ్డిగూడ గ్రామ సిపిఎం సీనియర్ కామ్రేడ్ గుండాల రాములు అనారోగ్యం తో మృతి చెందాగాఈరోజు గ్రామానికి వెళ్లి రాములు భౌతిక దేహo పైన పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ రాములు తండ్రి తెలంగాణా సాయూదా పోరాట యోధుడని అతని వరసత్వమంలో ఉన్నారని అన్నారు. పేదల సమస్య కొరకు జరిగినఅనేక కార్యక్రమం లో చురుకుగా పాల్గొన్నాడని తెలిపారు.ఇండ్లు, ఇండ్ల స్థలాలు, కొరకు సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన పోరాటం లో పాల్గొన్నారిని అన్నారు. ఈ కార్యక్రమం లో సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, మండల కమిటీ సభ్యులు కొండ వెంకన్న, కొత్త అంజయ్య, మాజీ సర్పంచ్ శ్రీరములు,బత్తుల బక్కయ్య,బత్తుల వెంకులు, నాయకులు బత్తుల సోమయ్య, గుండాల సైదులు,బొల్లం వెంకన్న, గుండెబోయిన యాదయ్య తదితరులు పాల్గొన్నారు.