Tnrnews.in
తెలంగాణరాజకీయం

సీపీఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి

జూన్10,11,12 తేదీలలో హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జరిగే సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. సోమవారం మునగాల మండలం కొక్కిరేణి గ్రామంలో సిపిఎం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ జిల్లా కమిటీ సభ్యులకు, మండల కమిటీ సభ్యులకు మూడు రోజులపాటు రాజకీయ చైతన్యం కలిగించడం జరుగుతుందన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ప్రజలపై పెనుబారం మోపుతుందన్నారు.ఆదివాసి హక్కుల కోసం పోరాడుతున్న మావోయిస్టులను హతం చేస్తుందన్నారు.చర్చలకు సిద్ధమని చెప్పిన వినకుండా నరమేధాన్ని చేస్తుందన్నారు. మరోపక్క పాకిస్తాన్ తో చర్చలు జరుపుతూ కాల్పుల విరమణ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరోపక్క ఈ దేశ పౌరులైన మావోయిస్టుల పై మారణ హోమం సృష్టిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 10 సంవత్సరాలు అవుతున్న భౌగోళిక తెలంగాణగా మాత్రమే అవతరించిందన్నారు. విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఉపాధి నేటికీ తెలంగాణ ప్రజలకు అందలేదన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నేటికీ అమలు చేయలేదని ఆరోపించారు. ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కోలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి, బెల్లంకొండ సత్యనారాయణ, కందాల శంకర్ రెడ్డి, పులుసు సత్యం, వీరబోయిన రవి, వట్టెపు సైదులు, షేక్ సైదా, బచ్చల కూర స్వరాజ్యం, కొప్పుల రజిత,మిట్టగనుపుల ముత్యాలు, కొదమగుండ్ల నగేష్, దుగ్గి బ్రహ్మం, జూలకంటి విజయలక్ష్మి, మేకన బోయిన శేఖర్ తదితరులు పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ఇచ్చే పథకాలు వర్తింపజేయాలి

TNR NEWS

ఆర్థిక చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో  బీద కుటుంబానికి టీ స్టాల్ పెట్టించి జీవనోపాధి కల్పించారు

TNR NEWS

ఘనంగా నిమజ్జన కార్యక్రమం ఆకట్టుకున్న ఎన్ ఆర్ ఎస్ కాలేజ్ విద్యార్థుల ప్రదర్శన

TNR NEWS

గడువు లోపు ఓటర్ గా నమోదు చేసుకోండి… మద్నూర్ తహసిల్దార్ ఏం డి ముజీబ్

TNR NEWS

కోర్టులో ఈ-సేవ కేంద్రం ప్రారంభం 

TNR NEWS

ప్రభుత్వ పథకాలకు మరో అవకాశం

TNR NEWS