Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఎన్నికల్లో మాదిగలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ జిల్లాల అధ్యక్షుడు చింత బాబు మాదిగ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం కోదాడ పట్టణంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాణాల అబ్రహం మాదిగ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా మాదిగలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అంబేద్కర్ అభయహస్తం పథకంతో ప్రతి మాదిగకు 12 లక్షల రూపాయలు ఇస్తామని నేటికీ ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా డప్పు, చెప్పు కుట్టుకునే మాదిగలకు 6000 రూపాయలు పెన్షన్ ఇవ్వడంతోపాటు లెదర్ పార్కులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మాదిగలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి బాణాల అబ్రహం మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి నాగేశ్వరరావు, కార్యదర్శి బొల్లెపోగు స్వామి, పిడమర్తి బాబురావు, సోమపొంగు శ్రీను, చింతా రాము తదితరులు పాల్గొన్నారు…….

Related posts

పోలీసులకు, ఉద్యమకారుల మధ్య  తోపులాట…  ఉద్రిక్తం…  ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకుల అక్రమ అరెస్టు, విడుదల  అనుమతులన్నింటినీ రద్దు చేసేంతవరకుఐక్యంగా ఉద్యమిస్తాం … ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నేతలపిలుపు….

TNR NEWS

జిన్నారంలో గుట్టపై భక్తుల సందడి 

TNR NEWS

ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం

Harish Hs

చివ్వెంల మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.

Harish Hs

ఏసీబీ వలలో కోదాడ ఫారెస్ట్ బీట్ అధికారి

Harish Hs

జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి

Harish Hs