మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామం లోని ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో,శనివారం కోదాడ నియోజకవర్గ మహా న్యూస్ రిపోర్టర్ తోటపల్లి నాగరాజు ఆధ్వర్యంలో,మహా న్యూస్ ఎండీ మారెళ్ల వంశీకృష్ణ పుట్టినరోజు సందర్భంగా,కేక్ కట్ చేసి,వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహా న్యూస్ ఎండీ మారెళ్ల వంశీకృష్ణ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.మహా న్యూస్ కేవలం రాజకీయ వార్తలే కాకుండా,భక్తి టీవీ చానెల్ తో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు,ఇలా సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం అభినందనీయం అని కొనియాడారు.సమాజహితం సనాతన ధర్మం తో సామాజిక కార్యక్రమాలు చేస్తూ,మిగిలిన వారికి ఆదర్శంగా నిలవడం ఎంతో సంతోషంగా ఉందని, అలాగే భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచి,ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ,ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం అభివృద్ధి ఇతరత్రా కార్యక్రమాలను, విస్తరించి అందరి మన్ననలు పొంది, రాజకీయాలకు పార్టీ లకు అతీతంగా పని చేస్తూ, నిష్పక్షపాతికంగా వ్యవహరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ,కాంగ్రెస్ పార్టీ నాయకులు తోట శ్రీను,ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు చెరుకుపల్లి శ్రీకాంత్, చీమచంద్రశేఖర్,ఏపూరి సునీల్, బండ్ల దాస్, కొమ్ము వెంకటేష్,ఆశ్రమం నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ,కో ఆర్డినేటర్ వాచేపల్లి జ్యోతి శ్రీకాంత్. తదితరులు పాల్గొన్నారు.