చేవెళ్ల మండల కేంద్రంలో ఉన్న సిల్వర్ డెల్ ప్రైవేట్ స్కూల్ బస్సు వరుస ప్రమాదాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం చేవెళ్ల మండల కేంద్రంలో సిల్వర్ డెల్ స్కూల్ బస్సు ప్రమాదాలపై ఆర్డివో చంద్రకళ, ఎంఈఓ పురన్ దాస్ లకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సిల్వర్ డెల్ స్కూల్ బస్సు శుక్రవారం చేవెళ్ల మండల పరిధిలోని చన్వెల్లి గ్రామంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నదని, ఈ ఘటనలో బస్సులో విద్యార్థులు ఉన్నారని అదృష్టవశాత్తు ఎవరికి ఏ ప్రమాదం జరగలేదన్నారు. ఇలా సిల్వర్ డేల్ స్కూల్ సంబంధించిన బస్సులు నిత్యం ప్రమాదాల గురవుతున్నాయని తెలిపారు. సిల్వర్ డేల్ కీ సంబంధించి వరుస ప్రమాదాలపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. ఆ స్కూల్ లో శిక్షణ పొందిన డ్రైవర్ లేకపోవడం, వారిలో కొంతమందికి లైసెన్స్ లు లేకపోవడం, డ్రైవర్ల నిరక్ష్యం వలన వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్కూల్ ను విజిట్ చేసి బస్సుల ఫిట్నెస్ ను, డ్రైవర్ల లైసెన్సులను పరిశీలించాలని అధికారులకు విన్నవించారు. స్కూల్ గుర్తింపును రద్దుచేసి, స్కూల్ యజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వేల రూపాయల ఫీజులు తీసుకుంటూ విద్యార్థుల జీవితాలపై దృష్టి లేకపోవడం సరైనది కాదన్నారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు తేజ, తదితరులు పాల్గొన్నారు.
next post