Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

గ్రామపంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచాలి నందరిని పర్మినెంట్ చెయ్యాలి

గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సేవలను గుర్తించి వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

 ఆదివారం గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ ఎండ్ వర్కర్స్ సిఐటియు అనుబంధం మండల కమిటీ సమావేశం మామిడి వెంకన్న అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశo లో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ గ్రామాలలో పారుశుద్ధ్యం, మంచినీటి సరఫరా,వీధిలైట్లు,డంపింగ్ యార్డ్స్,హరితహారం,పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు తదితర పనులు వివిధ కేటగిరీల వారీగా పనిచేస్తు. అనారోగ్యాలు రాకుండా ప్రజల ఆరోగ్యాలను కాపాడుతు పంచాయతీ కార్మికులుగా సేవలందిస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని, జీవో నెంబర్ 51 ని సవరించాలని మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని కేతగిరీల వారీగా వేతనాలు పెంచాలని కారోబార్, బిల్ కలెక్టర్ల, ను స్పెషల్ స్టేటస్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినారు.

 ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ ఎండ్ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి వెంకన్న, ఉపాధ్యక్షులు టి ముత్తయ్య, ఎం ముత్తయ్య, బి పరుశురాములు, ఎస్ నాగరాజు, జి ప్రసాద్, రఘు,నరసయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Related posts

హమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకై చలో కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి * ములుగుమండల సిఐటియు నాయకులు ఎర్రోళ్ల మల్లేశం 

TNR NEWS

కొనసాగుతున్న డేటా ఎంట్రీ నమోదు : ఎంపీడీవో నర్సింహారెడ్డి 

TNR NEWS

మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

TNR NEWS

“ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రైవేటు పాఠశాల మాదిరిగా ఎల్కేజీ,యూకేజీ,నర్సరీ, ప్రవేశపెట్టాలి”

TNR NEWS

చదువుల సరస్వతి సావిత్రిబాయి పూలే 

TNR NEWS

పబ్లిక్ క్లబ్ అభివృద్ధికి కృషి పబ్లిక్ క్లబ్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ భూమి పూజ

TNR NEWS