Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సిపిఎం జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి

జూన్10,11,12 తేదీలలో హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జరిగే సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ జిల్లా కమిటీ సభ్యులకు, మండల కమిటీ సభ్యులకు మూడు రోజులపాటు రాజకీయ చైతన్యం కలిగించడం జరుగుతుందన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ప్రజలపై పెనుబారం మోపుతుందన్నారు. ఆదివాసి హక్కుల కోసం పోరాడుతున్న మావోయిస్టులను హతం చేస్తుందన్నారు. చర్చలకు సిద్ధమని చెప్పిన వినకుండా నరమేధాన్ని చేస్తుందన్నారు. మరోపక్క పాకిస్తాన్ తో చర్చలు జరుపుతూ కాల్పుల విరమణ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరోపక్క ఈ దేశ పౌరులైన మావోయిస్టుల పై మారణ హోమం సృష్టిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 10 సంవత్సరాలు అవుతున్న భౌగోళిక తెలంగాణగా మాత్రమే అవతరించిందన్నారు. విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఉపాధి నేటికీ తెలంగాణ ప్రజలకు అందలేదన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నేటికీ అమలు చేయలేదని ఆరోపించారు. ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ శిక్షణ తరగతులకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం తదితరులు హాజరవుతున్నారని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులునెమ్మాది వెంకటేశ్వర్లు, కోలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు.

Related posts

కిష్టంపేట ప్రభుత్వ పాఠశాలకు జ్ఞాపకార్థం బీరువా, కుర్చీలు వితరణ

TNR NEWS

మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సహకారంతో మార్కెట్ అభివృద్ధికి కృషి

TNR NEWS

*నవంబర్ 29,30, డిసెంబర్ 1 తేదీలలో సూర్యాపేట లో జరిగే సిపిఎం జిల్లా మహాసభలు జయప్రదం చేయండి.* *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

మునగాల మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్& ఎం.ఎస్.పి. ఆధ్వర్యంలో ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Harish Hs

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

Harish Hs

బాపూజీ గ్రంథాలయం ఎదుట బీఈడీ అభ్యర్థుల నిరసన

TNR NEWS