కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు విమర్శించారు
బీసీలకు 42 శాతం రిజర్వేషలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోదాడ ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా అంతరం డి టి దుగ్యాల సతీష్ గారికి మెమోరం అందజేయడం జరిగింది
ఈసందర్భంగా రాములు మాట్లాడుతూ బిజెపి ఆర్ఎస్ఎస్ తన మూల సిద్ధాంతంలోనే రిజర్వేషన్లకు వ్యతిరేకమని రాజ్యాంగబద్ధంగా సంక్రమించాల్సిన రిజర్వేషన్లను మోడీ సర్కార్ అడ్డుకుంటుందని ఆయన విమర్శించారు తెలంగాణ పట్ల మోడీ సర్కార్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడం ద్వారా స్థానిక సంస్థలతోపాటు విద్యా ఉద్యోగాల్లో ఉపాధిలో బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేంత వరకు ఐక్య ఉద్యమాలు చేస్తామని పోరాటాల ద్వారానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమని అందుకు పోరాటాలకు సిద్ధం కావాలని రాములు పిలుపునిచ్చారు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించేందుకు ఎస్సీ, ఎస్టీ బీసీలు సకల జనులంతా ఐక్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు
ఈ యొక్క కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు జుట్టు కుంట బసవయ్య బీసీ సంఘం నాయకులు బత్తుల ఉపేందర్ కోదాడ పట్టణ కార్యదర్శి ఎం ముత్యాలు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్కే సైదా సిపిఎం నాయకులు దేవర వెంకటరెడ్డి సిపిఎం కోదాడ మండల నాయకులు మన్యం వెంకటయ్య పట్టణ కమిటీ సభ్యులు దాసరి శీను ఎస్.కె రహిమాన్ మరియన్న జంగాపల్లి సాయి వి రాముడు వెంకన్న తదితరులు పాల్గొన్నారు