- పోటీలను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ
పిఠాపురం : ఆదివారం జిల్లాస్థాయి ఆర్చరీ పోటీలు పిఠాపురం ఆర్.ఆర్.బిహెచ్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు రాజమహేంద్రవరం, అమలాపురం, రాజోలు, కాకినాడ, తుని, పిఠాపురం 60 మంది ఇండియన్ రౌండ్ ఆర్చర్స్ వివిధ విభాగాలలో పాల్గొన్నారు. ఇందులో పిఠాపురం ఆర్చర్స్ ఓవరాల్ మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో కాకినాడ, మూడో స్థానంలో అమలాపురం ఆర్చర్స్ నిలిచారు. ఈ పోటీలను పిఠాపురం మాజీ శాసనసభ్యుడు ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ ప్రారంభించారు. పోటీలలో పాల్గొన్న కొంతమంది క్రీడాకారులకు పథకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం టిడిపి ఫ్లోరో లీడర్ అల్లవరపు నగేష్, కాకినాడ జిల్లా ఆర్యవైశ్య సంగం కన్వీనర్ బోడ సతీష్, సభ్యులు పాల్గొన్నారు. పోటీలు అనంతరం జనసేన నాయకులు వూటా నాని బాబు, మర్నీడి రంగబాబు, కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్ బహుమతి ప్రధానం చేశారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా పి.కృష్ణ, కె.చిన్నబ్బాయి, ఎం.గణేష్, జె.ప్రసాదరావు వ్యవహరించారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జె.ఎన్.ఎస్.గోపాలకృష్ణ, పి.లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా డిస్టిక్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ బి.శ్రీనివాస్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు కె.పద్మనాభం క్రీడాకారులను అభినందించారు.