పిఠాపురం : పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ సోమవారం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ కి పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలు, లక్ష్మీపురం, సీతారాంనగరం, మల్లవరం, చెందుర్తి, తాటిపర్తి ఎస్సీ పేట ఏరియాల వరద నీరు వస్తోందని, అలాగే గొల్లప్రోలు సంబంధించి గొల్లప్రోలు ప్రాంతం అంతా కూడా బాగా వరద నీరుతో ముంపుకు గురవ్వడం జరిగింది అన్నారు.
దీనికి కారణం కొండకాలవ సుద్ధగడ్డ ఏదైతే కెపాసిటీ కాలువ ఉందో అది 700 మించి లేదని, 1600 వరకు వచ్చేయడంతో పైన ప్రతిపాదన ఎస్కేప్ పైకి లేపడంతోటి ఇవన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు కావడం వల్ల మునిగిపోతున్నాయి అన్నారు. ఇటు చేబ్రోలు, మల్లవరం ప్రాంతంలో సుమారు దగ్గర 400 నుంచి 500 ఎకరాలు మునిగిపోవడం జరిగిందన్నారు. వెద జెల్లిన పొలాలకు విత్తనాలు ఆల్టర్నేట్ గా ప్రభుత్వం ఇచ్చే విధంగా చూస్తామని జిల్లా కలెక్టర్ చెప్పారని, కలెక్టర్ దృష్టిలో కూడా పెట్టడం జరిగిందన్నారు. చెందుర్తిలో పంట చేలు, మెట్ట ప్రాంతాల్లో పంటలు కూడా మునిగిన పరిస్థితి ఉందని గుర్తు చేశారు. వరదలు తగ్గాక వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు పర్యవేక్షణ చేసి ఎక్కడెక్కడ నష్టం వాటిల్లిందో దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈరోజు పిఠాపురం నియోజవర్గంలో పలు ప్రాంతాలు ముంపుకి గురవ్వడానికి కారణం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. సుద్ధగడ్డ ఆధునికరణ కోసం ఏలేరు ఫేస్-2కి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.160 కోట్లు ఇచ్చి శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించిన దానిని జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడం జరిగిందన్నారు. ఆరోజు ఉన్న రాజకీయ నాయకులు ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దగ్గరుండి రద్దు చేయించడం హేయమైన చర్య అన్నారు. ఇది ప్రజలు అందరూ గమనించాలని హితవు పలికారు. ప్రజలందరూ ఒకసారి ఎవరి టైంలో తెచ్చారు, ఎంత కష్టపడి తెచ్చారు, గతంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు రద్దు చేశాడు, ఇప్పుడు ఈరోజు ఈ వరదలు వల్ల ఎంత నష్టం వాటిల్లిందని… దీనికి కారణం ఎవరు ? అని ప్రజలు గమనించాలన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రద్దు చేయకుండా ఉంటే ఏలేరు ఫేస్-2 పనులు పూర్తి అయిపోయి ఉంటే ఈరోజు వరదలు వచ్చినా, ఏది వచ్చిన భార్య పిల్లలతో రైతు ఇంటి దగ్గర కూర్చుని పరిస్థితి ఉండేదని, ఇదే మనం ఆలోచించాలన్నారు. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ దేవేంద్రుడు, మాజీ జెడ్పిటిసి ప్రసాద్, పుణ్యమంతుల మూర్తి, వీరబాబు, వీరయ్య, మల్లిబాబు మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.