*పిఠాపురం:* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ, కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి పురస్కరించుకొని 1008 గణేశుని మట్టి ప్రతిమలను పిఠాపురం మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రేపాక రమేష్ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణ మరియు మండలం ప్రజలకు పంపిణీ చేశారు. మట్టి వినాయకుడిని పూజించండి… పర్యావరణ పరిరక్షణ చేయండి అనే నినాదంతో ఈ కార్యక్రమం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య మహాసభ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షుడు వెలగా వెంకట నగేష్, ఆర్యవైశ్య మహాసభ కాకినాడ జిల్లా జోన్ ఛైర్మన్ ఇమ్మిడిశెట్టి నాగేంద్రకుమార్, కాకినాడ జిల్లా డిస్ట్రిక్ట్ కన్వీనర్ బోడ సతీష్, పిఠాపురం మండల ఆర్య వైశ్య అధ్యక్షుడు రేపాక రమేష్, చక్క శోభనాద్రి, చక్క వెంకట్, నడిపల్లి కళ్యాణ్, ఆదినారాయణ, రేపాక దత్తు, కర్ణాటక తాతాజీ, కంచర్ల నగేష్, కంబంపాటి శ్రీరామ్, కొత్త దేవ జగన్మోహన్ గుప్తా, వాసవి కన్యకా పరమేశ్వరమ్మ వారి దేవాలయం అధ్యక్షుడు దంగేటి సత్యనారాయణమూర్తి మరియు, జనసేన నాయకులు సూరవరపు సురేష్, మార్నీడి రంగబాబు, వనం వీరబాబు, తెలుగుదేశం నాయకుడు, కౌన్సిలర్ అల్లవరపు నగేష తదితర నాయకులు మరియు పిఠాపురం మండల ఆర్యవైశ్య సంఘం ఇతర సభ్యులు మండల ప్రముఖ ఆర్యవైశ్యులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

previous post