సూర్యాపేట: జనవరి 25 నుండి28 వరకు హైదరాబాదులో జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా )14వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఐద్వా నిరంతరం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. మహిళలకు సమాన హక్కులు, విద్య, వైద్యం, అందించాలని రాజీలేని పోరాటాలు చేస్తుందన్నారు. మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాల పై అనేక పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి75 సంవత్సరాలు అవుతున్న నేటికీ మహిళల పట్ల సమాజం చిన్న చూపు చూస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మైక్రో ఫైనాన్స్ వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. అనంతరం ఆలిండియా మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు తంగెళ్ల వెంకట చంద్ర, జిల్లా నాయకురాలు మేకన బోయినసైదమ్మ, విజయలక్ష్మి, షేక్ ఖాజాబీ, ఇందిరాల త్రివేణి, బచ్చలకూరి మంగమ్మ, యానాల సుశీల, సుందరి రమాదేవి, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
