తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సహకారంతో పిల్లలమర్రి లో నానాటికి దినాభివృద్ధి చెందుతున్న కాకతీయులు నిర్మించిన శివాలయాలకు తోడుగా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ జిల్లా నాయకులు గట్టు శ్రీనివాస్ అన్నారు.శివాలయాల్లో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకారం తో ఇప్పటికే పటేల్ రమేష్ రెడ్డి ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు. నియోజకవర్గంలో ఉండ్రుగొండ కు రెండున్నర కోట్లు, సద్దుల చెరువు మిని ట్యాంక్ బండ్ కు 5 కోట్లు, పిల్లలమర్రి కి 3 కోట్లతో అభివృద్ది చేసేందుకు నిధులు మంజూరు కాగా పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. ముందుగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీనివాస్ జ్యోతి దంపతులు అర్చకులకు కార్తీక దీపదానాన్ని చేశారు. ఆయన వెంట బండారు సత్యనారాయణ, పద్మ, ప్రవీణ్, వెంకన్న, ఉదయ్ పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.