మోతే: ప్రజల ఆరోగ్యాలకు నష్టం కలిగించే ఎన్ఎంకెఇథనాల్ కంపెనీ రద్దు అయ్యేంతవరకు ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కన్నెగంటి రవి పిలుపునిచ్చారు.గురువారం మోతే మండలం సర్వారం గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో జరిగిన ఎన్ఎంకె ఇథనాల్ కంపెనీ-దాని దుష్ఫలితాలు- ప్రజలపై ప్రభావం”అనే అంశంపై జరిగిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ధాన్యాలతో ఉత్పత్తి చేసే ఇథనాల్ కంపెనీ ని ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా దాని దుష్ఫలితాలను ప్రజలకు వివరించకుండా రావిపాడు గ్రామంలో నిర్మించడానికి ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. మోడీ ప్రభుత్వం విచ్చలవిడిగా తెలంగాణలో 30 ఇథనాల్ కంపెనీలకు అనుమతులు ఇవ్వడంతో ప్రజల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రజల అభిప్రాయం లేకుండా ఈ ప్రాంతంలో కంపెనీ ఏర్పాటు చేయడం సరికాదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు లాభాలు చేకూర్చేవిధంగా కొమ్ముకాస్తుందని, ప్రజల అభిప్రాయాల ను నివృత్తి చేయడం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలపై బాధ్యత ఉందన్నారు.ఆహార ధాన్యాల ద్వారా ఇథనాల్ ఉత్పత్తి చేసే విధానాన్ని మానుకొని ఇతర ప్రత్యమ్నయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఆహార ధాన్యాలను ఉపయోగించడం వలన భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడి పేదలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇథనాల్ ఉత్పత్తికి ప్రధానంగా నీరు కూడా అవసరం ఉంటదని దీనిని పాలేరు జలాలను వాడటం వలన మంచినీరు కొరత, పంటల సాగు కు సాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. భూగర్భ జలాలను పెద్ద పెద్ద మోటార్ల ద్వారా ఈ కంపెనీ వాడుకుంటే ఈ ప్రాంత రైతాంగం, ప్రజలు బోరులపై ఆధారపడి పంటలు పండించే పరిస్థితిని కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కంపెనీలన్నీ ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు సబ్సిడీలు పైన ఆధారపడి నడుస్తాయని దీనివలన ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ప్రజలు గుండె నొప్పి, తలనొప్పి,కళ్ళు దురద, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ కారకాలు, శ్వాసకోస వ్యాధులు లాంటి అనేక నష్టాలు ఉన్నాయని తక్షణమే కంపెనీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కంపెనీ ద్వారా 30 కిలోమీటర్లు పైగా వాసన రావడం మూలంగా ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఎలాంటి కాలుష్యం లేకుండా కంపెన నడిపించాలని నిబంధనలు ఉన్నాయని ఆ నిబంధనలకు విరుద్ధంగా కంపెనీ నిర్మాణం చేస్తున్నారని అన్నారు. తక్షణమే కంపెనీని రద్దు చేయాలని కోరారు. ఎన్ఎంకెఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ఉప్పుల సందీప్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ అవగాహన సదస్సులో ప్రముఖ సీనియర్ జర్నలిస్టు పద్మ, గ్రామ సర్పంచ్ మిక్కిలినేని పురుషోత్తం రావు, ఉప సర్పంచ్ నల్లాల శ్రీను, ఎన్ఎంకె ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు మండారి డేవిడ్ కుమార్, మట్టిపల్లి సైదులు, పేర్ల నాగయ్య, నల్లెడ మాధవరెడ్డి, నారబోయిన వెంకట యాదవ్, ఆవుల నాగరాజు, నకిరేకంటి చిట్టిబాబు, గుండు వెంకన్న, చామకూరి నరసయ్య, కునుకుంట్ల సైదులు, గంట నాగయ్య, గుంజలూరు కోటయ్య, పుల్లూరి సింహాద్రి, మధు, యోగానందం,మేకల గురు కృష్ణ, పల్స మల్సూర్,ఉప్పుల మధు యాదవ్, వీరబోయిన లింగయ్య, మదర్ గౌడ్, యాదవ్, సోమ గాని మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.