పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలు ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా సహకరించాలని సూర్యాపేట DSP రవి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లాకేంద్రంలో సాయంత్రం ఆకస్మికంగా కొత్తబస్టాండ్ వద్ద ట్రాఫిక్ నియంత్రణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభా దృశ్యా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. DSP వెంట ట్రాఫిక్ SI సాయి కుమార్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.