మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణంలో ‘ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు’ పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఒక సంవత్సరం లో సాధించిన విజయాలను ప్రజలకు చెప్పే ఉద్దేశ్యం తో ఈ ప్రజా పాలన ఉత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో తొర్రూర్ బస్టాండ్ ఆవరణం లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజలకు అందించిన కార్యక్రమాలను, త్వరలో చేయబోయే పనుల గురించి తెలుపుతూ ఫ్లెక్సీ లను ఏర్పాటు చేశారు.కాని ప్రజలు గత సంవత్సరకాలం నుంచి ప్రభుత్వం చేసే పనులను నిషితంగా గమనిస్తున్నామని అంటున్నారు.మాకు చేయబోయే నూతన కార్యక్రమాలు కాదు ప్రభుత్వం తొలి రోజులలో ప్రారంభించిన పనుల అమలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఫ్లెక్సీ లపై ఏర్పాటు చేయండని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు.ప్లెక్సీల పై అభివృద్ధి పనులు రాయడం కాదు ముందుగా తొర్రూర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ఇంకా అభివృద్ధి పనులు మొదలెకాలేదు, తొర్రూర్ బస్టాండ్ లోపల సిసి కెమెరాలకు దిక్కేలేదు అని ప్రజలు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తొర్రూర్ బస్టాండ్ లో రోడ్డు పై బైక్స్ పార్కింగ్ చేయడంతో బస్సు రాకపోకలకు ఇబ్బంది అవుతుంది.కావున అధికారులు బైక్స్ పార్క్ చేయకుండా చర్యలు తీసుకోవాలి అని ప్రజలు కోరుతున్నారు.కనీసానికి విజయోత్సవాలాలో భాగంగా బస్టాండ్ అవరణం లో ప్రయాణికులు కూర్చోవటానికి కుర్చీలైనా వేశారని ప్రజలు సంతోష పడుతున్నారు.ఒక వైపు విజయోత్సవాలు అంటున్నారు. ఇది ప్రజల పై పాలకుల విజయమా? అని ప్రజలు అనుకుంటున్నారు.
previous post