Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

కేసీఆర్‌ రైతుబంధు.. రేవంత్‌ రాబందు! కాంగ్రెస్‌ అంటే మోసం, దగా, నయవంచన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తాలో పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి రైతుకి ఎకరానికి 15000 చెల్లించాలని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ..పదివేలు బిచ్చం అన్నరు.మరిప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇస్తున్నదేమిటి? నువ్వు పెంచిన రెండు వేలు ఏమిటి? ముష్టి వేస్తున్నవా .తెలంగాణలో పెద్ద ఎత్తున రైతు సంక్షేమ పథకాలు అమలుచేసి కేసీఆర్‌ రైతుబంధుగా నిలిస్తే.. హామీలకు కోతపెడుతూ రేవంత్‌రెడ్డి రాబందుగా మారాడు. కాంగ్రెస్‌ అంటేనే మోసం, దగా, నయవంచన అని మరోసారి రుజువైంది. రైతుభరోసా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించి, 12 వేలకు కుదించడమంటే రైతులను నిలువునా వంచించడమే. స్థానిక సంస్థల ఎన్నికల గండాన్ని దాటేందుకే రైతు భరోసాపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ ద్రోహాన్ని రైతులు ఎప్పటికీ క్షమించరు అని అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

దశల వారీగా రైతు భరోసా.. 45 రోజుల్లో జమ..!

TNR NEWS

జిల్లాలో సదర్ సమ్మేళన్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Harish Hs

ఓదార్చి వస్తుండగా అనంతలోకానికి వెనకనుంచి అతివేగంగా వచ్చి ఢీ కొట్టిన లారీ ఒకరు మృతి ఒకరికి తీవ్ర గాయాలు

TNR NEWS

కొనసాగుతున్న డేటా ఎంట్రీ నమోదు : ఎంపీడీవో నర్సింహారెడ్డి 

TNR NEWS

వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి – బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి  – సొంత నిధులతో మండల కేంద్రంలో నూతన విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ 

TNR NEWS

ఉపాధి’ హామీ పథకంలో అవకతవకలు..!

TNR NEWS