హోంగార్డ్స్ రైసింగ్ డే సందర్భంగా శుక్రవారం జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ కార్యాలయం లో కేక్ కట్ చేసి హోం గార్డ్స్ రైసింగ్ డే కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లా లోని హోం గార్డ్స్ అధికారులతో కలసి హోం గార్డ్స్ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొనడం చాల ఆనందంగా ఉంది. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ అధికారులతో కలసి విధులు నిర్వహితున్న హోం గార్డ్స్ అధికారులకు అభినందనలు. జిల్లా పోలీస్ శాఖలో ఒక భాగమై,పోలీసులతో సమానంగా నిరంతరం విధులు నిర్వర్తిస్తూ హోంగార్డు ఆఫీసర్స్ అందిస్తున్న సేవలు అమోఘమని అన్నారు. వర్షాకాలం లో వాగులు ప్రవహించినప్పుడు, ఎన్నికల సమయంలో మరియు రోజువారీ విధులలో హోంగార్డ్ ఆఫీసర్స్ అంకిత భావంతో సేవలందిస్తున్నారని అన్నారు.శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలకు రక్షణ కల్పించడంతో బాధ్యతయుతమైన సేవలు అందించడంతో పాటు పొరుగు రాష్ట్రాలలో ఎన్నికల బందోబస్తులో అప్పగించిన భాధ్యతలను నిబద్ధతతో నిర్వహించారని వారి సేవలను .హోంగార్డ్స్ ఆఫీసర్స్ యొక్క సంక్షేమానికి అన్ని వేళలా ముందుంటామని తెలిపారు.
పోలీస్ మరియి హోం గార్డ్స్అధికారులు ఒక కుటుంబం లాగ కలసి పని చేస్తూ, ప్రజలకు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించుదాం. హోం గార్డ్స్ అధికారులకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేరుగా వచ్చి కలవాలని, ప్రతి ఒక్క హోం గార్డ్స్ అధికారి తమ కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటూ, తమ తమ ఆరోగ్యల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ తెలిపారు.
అనంతరం ఎస్పీ జిల్లాలో ఉత్తమ సేవలు అందిస్తున్నా ముగ్గురు హోం గార్డ్స్ అధికారులకు శాలువాతో సన్మానించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమం లో జిల్లా అదనపు ఎస్పీ టీవీ . హన్మంత్ రావు, ఆర్ ఐ డేవిడ్, అంజాత్ పాషా గార్లు, ఆర్ ఎస్ ఐ లు, జిల్లా హోం గార్డ్స్ ప్రసిడెంట్ సుధాకర్, తెలంగాణ రాష్ట్ర హోం గార్డ్స్ ఆర్గనైజర్ చంద్ పాషా గార్లు, జిల్లా లోని హోం గార్డ్స్ అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది.