ఈనెల 23న ది కోదాడ లారీ అసోసియేషన్ కార్యాలయంలో జరిగే జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమంలో రవాణా రంగంలో పనిచేసే డ్రైవర్లు,ఓనర్లతోపాటు ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోదాడ ఎం వి ఐ షేక్ జిలాని తెలిపారు. గురువారం లారీ అసోసియేషన్ కార్యాలయంలో కార్యక్రమం విజయవంతానికై లారీ యజమానులతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. 23న జరిగే అవగాహన సదస్సుకు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, రవాణా శాఖ అధికారులు పాల్గొంటున్నారని రవాణా రంగంలో పనిచేసే వారితోపాటు ప్రజలందరూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం లారీ యజమానులకి రోడ్డు ప్రమాదాల నివారణ మనందరి బాధ్యత అంటూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కోదాడ అసోసియేషన్ అధ్యక్షులు తూణం కృష్ణ, ప్రధాన కార్యదర్శి యలమందల నరసయ్య, ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు పైడిమర్రి వెంకటనారాయణ, ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల రామారావు, కోశాధికారి బాబు, జాయింట్ సెక్రటరీ కోటేశ్వరరావు, పెద్ది అంజయ్య, ఓరుగంటి ప్రభాకర్, వెంకట్ రెడ్డి, విలాస కవి నరసరాజు, లింగయ్య, దొంగరి సుధాకర్, జగన్, కొల్లు ప్రసాద్, రెడ్డి తదితరులు పాల్గొన్నారు………