మానకొండూర్:
మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు గురువారం పరిశీలించారు.మానకొండూర్,దేవంపల్లి,శ్రీనివాస్ నగర్,ఈదులగట్టెపల్లి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని,ధాన్యం తూకంలో తేడా రాకుండా చూడాలని సెంటర్ నిర్వాహకులకు చైర్మన్ ఓదెలు సూచించారు.