మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్ఐ శంకర్ రావు అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా గురువారం బాలికల ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ వేసుకోవాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు. ప్రతి వాహనదారుడు రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని సూచించారు. అంతకుముందు విద్యార్థిని విద్యార్థులతో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేవతి, అబ్దుల్ రఫీదు, సరస్వతి, శ్రీవాణి, కనక లక్ష్మి హెడ్ కానిస్టేబుళ్లు యూనిస్, సుధాకర్ రెడ్డి, పోలీస్ కానిస్టేబుల్ సౌజన్య, పృద్వి, శ్రీనివాస్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
previous post
next post