Tnrnews.in
తెలంగాణ

ప్రతిభ చూపితే ఉద్యోగ అవకాశాలు

టి ఎన్ ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ

 

విద్యార్థులు కష్టపడి చదివి ప్రతిభ చూపితే తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. ఆదివారం కోదాడ గ్రంథాలయంలో చదువుకుంటూ ఉద్యోగాలు సాధించిన పలువురిని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బాలమ్మ తో కలిసి సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు మెరుగైన సమాజం నిర్మాణ కోసం తమ వంతు కృషి చేయడంతో పాటు పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలను చేరదీసి వారికి అండగా నిలవాలి అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు నిరుత్సాహానికి గురికాకుండా వీరిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. గ్రంథాలయంలో విద్యార్థులు చదువుకునేందుకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. కష్టపడి చదివి తల్లిదండ్రులు కన్న కలలను నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బాలమ్మ, పిల్లుట్ల శ్రీనివాస్,షేక్ రహీం, లలితా దేవి, మంగమ్మ,రమేష్, నాగమ్మ, పట్నీ, శివాజీ తదితరులు పాల్గొన్నారు…….

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

Harish Hs

పోరాటాల ద్వారానే రిజర్వేషన్లు సాధ్యం

Harish Hs

57వ జాతీయ వారోత్సవాలకు హాజరైన సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్

TNR NEWS

కూలీల ఆటో బోల్తా, పలువురికి గాయాలు

TNR NEWS

ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్

Harish Hs

కాంగ్రేస్ ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు KGKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

TNR NEWS