కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడులను 100 శాతానికి పెంచే ప్రతిపాదికను వెంటనే విరమించుకోవాలని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు మంగళవారం కోదాడ పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్ చట్ట సవరణలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకొని భారతదేశ బీమా మార్కెట్ పై విదేశీ కంపెనీల పెత్తనం ఉండకూడదని డిమాండ్ చేశారు. భీమా ప్రీమియంపై జిఎస్టి ఎత్తివేయాలని ప్రజా వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష,కార్యదర్శులు విజయ శంకర్, బి కన్నయ్య, శ్రీనివాస్,సువర్ణ రాణి, కరుణ, రవికుమార్, సందీప్, శ్రీనివాస్, శివ, ఉపేందర్, హుస్సేన్ బి తదితరులు పాల్గొన్నారు………