Tnrnews.in
తెలంగాణ

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలి – ఎవరో చెప్పే మాయ మాటలు విని మోసపోవద్దు – సీనియర్ జూనియర్ అని చూడకుండా స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాలి – గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి

 

సిద్దిపేట జిల్లా గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కావేరి యూనివర్సిటీ విద్యార్థినిలకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, యాంటీ ర్యాగింగ్ తదితర అంశాల గురించి అవగాహన కల్పించిన గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, గజ్వేల్ షీ టీమ్ బృందం, భరోసా సెంటర్ సిబ్బంది. గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, షీటీమ్ నిర్వహిస్తున్న విధుల గురించి, షీటీమ్ ద్వారా ఎలా రక్షణ పొందొచ్చు అనే అంశాల గురించి, ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో, షీ టీమ్స్, యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు, నూతన చట్టాల గురించి, మరియు అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దు, సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుంది. మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం మహిళల భద్రత మా ముఖ్య బాద్యత. చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దు అన్నారు. ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని తెలిపారు, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలని మరియు సామాజిక రుగ్మతల గురించి అవగాహన అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కావేరి యూనివర్సిటీ చైర్మన్ ప్రతాప్ కుమార్ రెడ్డి, మరియు ప్రొఫెసర్లు, గజ్వెల్ షీటీమ్ బృందం శ్రీరాములు ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుల్ శ్యామల, కానిస్టేబుళ్లు రాంచంద్రారెడ్డి, మహేష్, భరోసా సెంటర్ సిబ్బంది హరిత, వినోద, సోనీ, యూనివర్సిటీ విద్యార్థినిలు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

16 కోట్ల 16 లక్షల లిఖిత రామ నామాలతో శ్రీరాముని అభిషేకం* – శాశ్వతమైనది రామ నామం ఒక్కటే – భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు

TNR NEWS

మాజీ ఉప ముఖ్యమంత్రి కె ఈ కృష్ణమూర్తి కలిసిన మాజీ మంత్రివర్యులు

TNR NEWS

ముగిసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరం

TNR NEWS

జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయం ప్రారంభం

TNR NEWS

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వెయ్యాలి.  ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

బానోత్ బిక్షం నాయక్ మరణం తీరని లోటు

Harish Hs