పిఠాపురం : జనసేన ఎన్.అర్.ఐ. సమన్వయకర్త కొలికొండ శశిధర్ యాదవ్ పిఠాపురం నియోజకవర్గంకు చెందిన మెడికల్ విద్యార్థినులు ఎర్రవరపు మౌనిక, రాయి శ్యామాలాకు చెరొక లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక చేయూత అందజేశారు. విద్యలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థినుల కుటుంబం చేతి వృత్తిపై ఆధారపడి కళాశాల ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నారని, స్థానిక నాయకులు తమను సంప్రదించిన నేపథ్యంలో ఈ సహాయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ చెక్ అందజేశారు. శుక్రవారం మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చెల్లుబోయిన సతీష్ కుమార్, తెలగంశెట్టి వేంకటేశ్వర రావు, చెల్లుబోయిన నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
