మండపేట : సూర్యచంద్ర ఫిషర్ మెన్ సోసైటీ ఆధ్వర్యంలో అంబాజీపేట లేజర్, రైట్ ఆసుపత్రి వైద్యులు డా. సైనీ, డా. మౌనిక పర్యవేక్షణలో 4వ వార్డ్ ఫిషర్ మెన్ కళ్యాణ మండపంలో ఆర్థోపెడిక్, డెంటల్, కంటి వైద్య శిబిరాన్ని గురువారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు గారు ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 300 మంది పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కంటి పరీక్షలు నిర్వహించి ఉచిత కళ్లద్దాలు పంపిణీ చేయడంతో పాటు అవసరమైన మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యచంద్ర ఫిషర్ మెన్ సోసైటీ అధ్యక్షులు కాటా గోపి, సెక్రటరీ పాండ్రంకి చిన్న, సింగిడి చిన్నారావు, ఆబోతు బద్రరావు, కాటా శ్రీరాములు, జంపా తాతాజీ, కాటా బుజ్జి, పాండ్రంకి సత్తిబాబు, గుండు తాతారాజు, పొలమూరి శ్రీను, ఆబోతు కృష్ణ, కాటా సత్యనారాయణ, పాండ్రంకి సత్యనారాయణ, పాండ్రంకి సత్తిబాబు సింగిడి ప్రసాద్, కాటా గోవిందు, జంప సత్యనారాయణ, సింగిడి శ్రీనివాస్, సింగిడి ప్రసాద్, కాటా శ్రీను, కాటా జనార్ధన్, సింగిడి శివ తదితరులు పాల్గొన్నారు.

previous post