బిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జిగా త్వరలోనే మల్లయ్య యాదవ్ ను పీకేస్తారన్న ఆలోచనతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. మంగళవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్న మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పట్ల మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేవలం సానుభూతితో 600 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి గత ఎన్నికల్లో ప్రజలు 60 వేల ఓట్లతో ఓడించిన ఇంకా సిగ్గు రాలేదని తమ నాయకుల పట్ల అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో ప్రజలే నిర్ణయిస్తారని ఇకనైనా పిచ్చి మాటలు మానుకోవాలన్నారు. నీ హయాంలో పట్టణంలో ఇల్లు నిర్మించేందుకు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసునని మట్టి, ఇసుక, గంజాయి మాఫియా వాళ్లతో చేతులు కలిపి కోదాడ నియోజకవర్గాన్ని బ్రష్టు పట్టించింది నిజం కాదా అన్నారు. నిన్ను వద్దనుకొని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 30 వేల మంది తమ కాంగ్రెస్ పార్టీలో చేరారని ఈసారి కనుక నువ్వు ఎన్నికల్లో పోటీ చేస్తే లక్ష ఓట్లతో ఓడిపోవడం ఖాయమన్నారు.మట్టి కాంట్రాక్టర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తాము పూర్తిగా విసిగిపోయామని మా వద్ద ఎంపీపీ, ఎమ్మెల్యే డబ్బులు వసూలు చేసి కూడా మట్టి తోలకాలు తోలనివ్వలేదని ప్రస్తుత ప్రభుత్వంలో ఎవ్వరికి కూడా ఎక్కడ ఒక్క రూపాయి ఇవ్వకుండా ప్రజలకు తక్కువ ధరకే మట్టిని అందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తావరపు పాండురంగారావు, మాజీ సర్పంచ్ పారా సీతయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, సిహెచ్ శ్రీనివాసరావు, కాంపాటి శ్రీను, శ్రీనివాసరెడ్డి, పాలూరి సత్యనారాయణ, గుండెల సూర్యనారాయణ, సుశీల రాజు, కట్టేబోయిన శ్రీను, డేగ శ్రీధర్,రజనీకాంత్, బాగ్దాద్, ధావల్ తదితరులు పాల్గొన్నారు………