వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా తన 61 వ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి, సేవా కార్యక్రమాలు నిర్వహించడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని కోదాడ పట్టణ ప్రముఖ న్యాయవాది కాకర్ల. వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని 17 వ వార్డులో తన మిత్రులతో కలిసి వార్డులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజులు, పెళ్లిరోజులు, శుభకార్యాల సమయంలో జీవితంలో గుర్తుండిపోయే విధంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.మిత్రులు కాకర్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్త రాంబాబు, యలమందల నరసయ్య, వీరాచారి, కాశీం, నెల్లూరి వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, ముండ్రా రవి, ఆర్.వి, పాలేటి నాగేశ్వరరావు, కోటయ్య, లక్ష్మయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు……….