పిఠాపురం : గత 2018వ సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి ధ్యేయంగా ఏపీ తెలంగాణలో 3000 ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు పర్యటన చేస్తూ విద్యార్థిని విద్యార్థుల సమస్యల పట్ల సోషల్ మీడియా ద్వారా డైరెక్ట్ గా ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేస్తూ, చదువు ద్వారా పేదరికం నిర్మూలించవచ్చు అనే మహానుభావులు యొక్క స్ఫూర్తిని పాఠశాలలలో తెలియజేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం ద్వారా నారా లోకేష్ కి డైరెక్ట్ గా ప్రభుత్వ పాఠశాలలలో, గురుకుల పాఠశాలలలో, సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో సన్న బియ్యం ఏర్పాటు చేయాలని తెలియజేయడం జరిగింది. అర్జీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సన్నబియ్యాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 1983లో గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు వ్యవస్థను తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీ రామారావు అప్పటి ప్రభుత్వ సలహాదారు ఎస్సార్ శంకరరాన్ గురించి కూడా విద్యార్థిని విద్యార్థులకు అనేక సందర్భాలలో తెలియజేయడం జరుగుతుంది. పేదలు అభివృద్ధి చెందాలంటే ఇంగ్లీష్ మీడియం అవసరమని గత ప్రభుత్వానికి తెలియజేసినప్పుడు, మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి పేదలు అత్యున్నత స్థాయికి చేరే విధంగా అనేక పథకాలు గత ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం పాఠశాలలకు వాటర్ ప్లాంట్స్, లైబ్రరీస్, ఫర్నిచర్, మెయింటినెన్స్, ప్రతి క్లాస్ కి టీచర్, గురుకులాలలో, సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో రద్దు చేసిన కాస్మెటిక్ ఛార్జీలు అమలు చేయాలని, గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి దళిత సంక్షేమ పథకాలు తిరిగి అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కార్పొరేషన్లకు ఫండ్ రిలీజ్ చేయాలని, ప్రభుత్వ పాఠశాలలలో చదువుకొనుచున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రీ బస్సుపాసులు ఇవ్వాలని, పాఠశాలలలో చదువుకొనుచున్న విద్యార్థిని విద్యార్థులకు ఒకటో తరగతి నుండి పీజీ వరకు ప్రీ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని, గురుకులాలలో, సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని, ప్రభుత్వానికి హృదయ పూర్వకంగా తెలియజేయడం జరుగుతుందన్నారు.
