పిఠాపురం : కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజవర్గం రౌతులపూడి మండలం మల్లంపేట గ్రామంలో గల సీనియాక్టర్ రెడ్డి నారాయణమూర్తి కుటుంబ సభ్యులచే నిర్మించిన శ్రీశ్రీశ్రీ సీతరామ సమేత లక్ష్మణ ఆంజనేయస్వామివారి ధ్వజ స్తంభ దివ్య ప్రతిష్టాత్మక మహోత్సవం కార్యక్రమానికి ఆలయాభివృద్ది కమిటి సభ్యులు రెడ్డి బుల్లబ్బాయి,రెడ్డి రామకృష్ణ ఆహ్వానం మేరకు శుక్రవారం ఉదయం జనసేన జిల్లా కార్యదర్శి & సాయిప్రియ సేవసమితి వ్యవస్దస్దాపక అధ్యక్షుడు జ్యోతుల శ్రీనివాసు మల్లంపేట గ్రామంలో గల సీతరామ సమేత లక్ష్మణ ఆంజనేయస్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామి వారి దర్శనం చేసుకుని ఆనంతరం ధ్వజస్తంభ స్దాపన నిమిత్తం జరిగే హోమిత్యాది కార్యక్రమాలలో పాల్గొని వేదపండితుల ఆశీస్సులు తీసుకొన్నారు. జ్యోతుల శ్రీనివాసు వెంట జిల్లా టెలీకమ్యూనికేషన్స్ సలహమండలి సభ్యులు మేకల కృష్ణ, దుర్గాడ గ్రామ జిల్లా పరిషత్ హైస్కూల్ చైర్మన్ శాఖ నాగేశ్వరరావు (నాగు), మాజీ చైర్మన్ కందా శ్రీనివాస్, మొగిలి శ్రీను, కాపారపు వెంకటరమణ, మేడిబోయిన శ్రీను, కొప్పుల చక్రధర్, మంతిన గణేష్, కొలా నాని, సఖినాల లచ్చబాబు తదితరులు పాల్గొన్నారు.

previous post