మోతె, నవంబర్5( TNR NEWS ) : కుక్కను తప్పియ్యబోయి కారు అదుపుతప్పి ఒకరి మృతి సంఘటన మోతె మండల పరిధిలోని మామిళ్ళగూడెం గ్రామంలోనీ సబ్ స్టేషన్ (ఈద్గా) సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు గోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం పోచవరం గ్రామానికి చెందిన అనపర్తి సాయిరాం(52),భార్య రాణి (38) ఇద్దరు పిల్లలు మొత్తం నలుగురు బుధవారం తెల్లవారుజామున హైదరాబాదు నుండి స్వగ్రామం పోచవరం గ్రామానికి టీ.ఎస్09ఈ.యస్0537 నంబర్ గల కారులో వెళ్తుండగా కారు కుక్కను తప్పించబోయి అదుపుతప్పి పల్టీ కొట్టుకుంటూ సైడ్ కు చెట్ల పొదల్లోకి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న భార్య రాణి అక్కడికక్కడే మృతిచెందగా ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. మృతురాలు రాణి భర్త పోలీసు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
