నటి సాయి పల్లవి ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నారని, బాలీవుడ్, తమిళ్ సినిమాలపై దృష్టి సారించారని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి, నటనకు ప్రాధాన్యతనిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. తండేల్ సినిమా తర్వాత ఆమె మరో తెలుగు సినిమా చేయకపోవడంతో, టాలీవుడ్ కు దూరం అవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి
