ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న సందర్భంగా శనివారం జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్ సూర్యాపేట రూరల్ పరిధిలో గల గాంధీనగర్ శివారులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులు, అధికారులతో ఎస్పీ మాట్లాడారు. ధాన్యం యొక్క తేమను పరిశీలించే పరికరాలను పరిశీలించి తేమశాతం పరిశీలనను రైతులకు అర్థమయ్యేలా వివరించాలని అధికారులకు తెలిపారు, రైతులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పించాలని, ప్రభుత్వ మద్దతు దర లభించేలా అధికారులు రైతులకు సహకరించాలని కోరారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రైతుకూ ప్రభుత్వం బరోసా కల్పిస్తుంది, ధాన్యం కొనుగోలు విషయంలో ఇతరుల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురికావద్దని కోరారు. ధాన్యం కొనుగోలు విషయంలో సమస్యలు ఉంటే సంభందిత అధికారులకు తెలిపి పరిష్కరించుకోవాలన్నారు. పుకార్లు నమ్మి ఆందోళన చేయవద్దు అని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఏవరైనా మోసం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.రైతులు ధాన్యంను రోడ్లపై అరబోయడం వల్ల రాత్రిళ్ళు ధాన్యం కనిపించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దు అని కోరారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు, సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి,ఎస్ ఐ బాలు నాయక్, ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బంది ఉన్నారు.