Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

జిల్లాలో గ్రూప్- III రాత పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు

నేడు,సోమవారం రెండు రోజులు పాటు జరిగే గ్రూప్-III రాత పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ పటిష్ట భద్రతా, బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని సూర్యాపేట జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట పట్టణంలో 30, కోదాడ పట్టణంలో 20 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి, ఈ కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు 163 బి.ఎన్.యస్.యస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్స్, మరియు చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు మూసి వేయాలని, మరియు పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుంపులుగా చెరవద్దు అని కోరారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ నందు పొందుపరిచిన విధంగా సమయానికి చేరుకోవాలని అన్నారు. అభ్యర్థులు తమవెంట పరీక్షా హాల్ లోకి సెల్ ఫోన్లు, ట్యాబ్, పెన్ డ్రైవ్, బ్లూటూత్, ఎలక్ట్రానిక్ వాచ్, కాలిక్యులేటర్లు, వాలెట్లు వంటివి తీసుకువెళ్లడానికి అనుమతి లేదు అన్నారు. కాళ్లకు షూ వేసుకోవద్దు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లేముందే ప్రధాన గేట్ వద్ద తనిఖీలు నిర్వహించే పోలీసు వారికి సహకరించగలరని పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు, వాహనాలు వేగంగా నడపవద్దు అన్నారు. ముందుగా బయలుదేరి ఎలాంటి వత్తిడి లేకుండా పరీక్షా వ్రాయాలని అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపినారు.

Related posts

29న జరిగేబహిరంగ సభను జయప్రదం చేయండి.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్ 

TNR NEWS

ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నాం

Harish Hs

*మాలల సింహ గర్జన.. ఐక్యత కోసం.. హక్కుల కోసం: ఎమ్మెల్యే వివేక్..!!*

TNR NEWS

మెకానిక్ కుటుంబానికి ఆర్థిక సాయం

TNR NEWS

అడవి పంది దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు…

TNR NEWS

క్వాలిటీ చికెన్ ను అందించి ప్రజల ఆదరణ పొందాలి..

Harish Hs