మెప్మా విభాగంలో పనిచేస్తున్న మహిళలు పట్టణంలో అట్టడుగునా ఉండే పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని మండలా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి సురేష్ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మెప్మా సిబ్బందితో ఏర్పాటుచేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పేదరికం, నిరక్షరాస్యత నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అన్నారు. ముఖ్యంగా మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. బాల్యవివాహాలు, పిల్లల్ని పనిలో పెట్టుకోవడం, వరకట్న వేధింపులు, గృహహింస వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. పేదలకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కోదాడ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ ఆర్ కె మూర్తి, కమిషనర్ రమాదేవి న్యాయవాదులు గట్ల నరసింహారావు, అక్కిరాజు యశ్వంత్,అబ్దుల్ రహీం, ఉయ్యాల నరసయ్య, చలం, బండారు రమేష్ బాబు, మంద వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు…..
previous post