పెద్దాపూర్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి శ్రీ డి నాగేశ్వరరావు శనివారం సందర్శించారు.ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను జగిత్యాల జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు జిల్లా జడ్జి తో పాటు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీకి దృష్టికి తీసుకు వెళ్తామని అన్నారు.విద్యార్థు లకు టాయిలెట్స్ మరియు హాస్టల్ వసతిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించెందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి ఉపాధ్యక్షుడు రాంబాబు సెక్రెటరీ వేణు ఏజీపీ ఆఫీస్ న్యాయవాదులు వెంకట నర్సయ్య, వడ్డేపల్లి శ్రీనివాస్ రాంభూపాల్,ప్రవీణ్,మహేష్ శేషు, సత్యం గోపి తదితరులు పాల్గొన్నారు.
previous post