Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సంక్రాంతి పండుగ దృష్ట్యా వాహనాల రద్దీ ఉంటుంది

సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రా ప్రాంతానికి వెళ్ళే వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది, వాహనదారులు అత్యంత అప్రమత్తంగా వాహనాలు నడపాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ అన్నారు. అధిక వేగం తో వాహనాలు నడవద్దు,నిద్ర మత్తులో వాహనాలు నడపవద్దు అని అన్నారు.దూర ప్రయాణం వల్ల అలసిపోవడం, నిద్ర మత్తు కారణంగా ప్రమాదాలకు జరిగే అవకాశం ఉన్నది తగు జాగ్రత్తలు పాటించాలి, వాహనాలు కండిషన్ లో ఉండాలి.చలి ప్రభావం, పొగమంచు ఉంటుంది రాత్రి సమయంలో ప్రయాణంలో డ్రైవర్ అప్రమత్తత అవసరం అని కోరినారు. అత్యవసర సమయంలో రహదారుల అధికారులను లేదా డయల్ 100 కు పొన్ చేసి సహాయం పొందాలి. రోడ్డు ప్రక్కన అనధికారికంగా ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపవద్దు అని విజ్ఞప్తి చేశారు. బారి వాహనాలు ఒక క్రమంలో వెళ్ళాలి, ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు అన్నారు. జిల్లా పరిధిలో జాతీయ రహదారి 65 పై విస్తరణ పనులు, మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి కాబట్టి అవసరమైన చోట పోలీసు డైవర్షన్స్ ఏర్పాటు చేసి గమనిక బోర్డులు పెట్టడం జరిగినది వాటిని పాటిస్తూ వాహందారులు నెమ్మదిగా వెళ్లాలి అన్నారు.ముఖ్యంగా జాతీయ రహదారి వెంట గల సూర్యాపేట రూరల్, చివ్వెంల, మునగాల, కోదాడ మండలాల పరిధిలో గల గ్రామాల రైతులు, ప్రజలు వ్యవసాయ పనులకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, తప్పుడు మార్గంలో వాహనాలు, పశువులను తీసుకువెళ్లడం ప్రమాదం అని గమనించాలి అన్నారు.పోలీసు సిబ్బంది రోడ్లపై 24 గంటలు గస్తీ నిర్వహిస్తారు, సీఐ ల పర్యవేక్షణలో ఎన్ హెచ్ 65 పై పెట్రోలింగ్ నిర్వహిస్తారు, బ్లాక్ స్పాట్స్ వద్ద వాహనాలు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నాం, రహదారి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి తప్పుడు మార్గంలో వాహనాలు నడిపినా, రోడ్లపై న్యూసెన్స్ చేసినా, ఎక్కడపడితే అక్కడ వాహనాలు అపినా కేసులు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. నిత్యం వాహనాలు తనిఖీ లు చేస్తూ మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్ నిరోధించాలి అని సిబ్బందికి సూచించారు.

Related posts

విద్యార్థుల కు మిఠాయి ల పంపిణి చేసిన అమ్మాపురం గ్రామస్తులు 

TNR NEWS

రోడ్లపై జరిగే వాహనాల ప్రమాదాలపై ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలి

Harish Hs

ముత్యాలమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం 

TNR NEWS

ఘనంగా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు

TNR NEWS

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన వెలమ సంక్షేమ మండలి సభ్యులు

TNR NEWS

మహిళా ఉద్యోగుల పట్ల వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

Harish Hs